JRE ని అనుసంధానించి తయారు చేసిన కొత్త ప్రోగ్రామ్(Downloader.zip) ని ఇక్కడినించి దింపుకోవచ్చు. దీన్ని పరిగెత్తించటానికి జావా ఉండాల్సిన అవసరం లేదు. Downloader.zip ని దింపుకున్నాక unzip చేస్తే మీకు Downloader.bat అనే ఫైలు కనిపిస్తుంది. దాని మీద రెండుసార్లు నొక్కి ఇదివరకట్లాగే ఫైల్ పాత్, సంవత్సరం, నెల వరుసగా ఇవ్వటమే. నెల అఖ్ఖర్లేదనుకుంటే Enter the month in quotes అని ప్రాంప్ట్ వచ్చినప్పుడు Enter key నొక్కండి.
ఈ ఉపాయం చెప్పిన నాగమురళి గారికి ప్రత్యేక ధన్యవాదాలు :)
=================================================================
మీరు చందమామ పిచ్చోళ్ళా? చందమామ వెబ్సైటులో పి.డి.ఎఫ్ లు తీసేసి ఫ్లాష్ ఫైళ్ళు పెట్టారని బాధపడుతున్నారా? 1947 నుండీ చందమామలు http://www.ulib.org/ లో వున్నాయని తెలిసీ ఒక్కొక్క పేజీ తెరిచి చదవలేక ఇబ్బంది పడుతున్నారా? అన్ని చందమామలూ డౌన్లోడ్ చేసుకుని ఒకానొక ఆదివారంపూట మధ్యాహ్నం తీరుబడిగా చదువుకోవాలని మీ ఆశా? టడట్టడా..........య్. ఇక్కడ ఒక్కసారి జేమ్స్ బాండ్ మ్యూజిక్ వేసుకోండి గాఠిగా.
ఐతే దింపుకోండి ఈ జావా ప్రోగ్రాం. దీన్ని పరిగెత్తించేముందు(అంటే రన్ చేసేముందన్నమాట) ఇక్కడినించి మీకు తగిన J.D.K. 1.6 దింపుకోవాలి. ఆతర్వాత ఈ ప్రోగ్రాముని స్టోర్ చేసిన ఫోల్డరుకెళ్ళి java -jar Downloader.jar -help అని కొడితే చాలు వివరాలు వస్తాయి.
సూక్ష్మంగా కొన్ని వివరాలు ఇక్కడ. ఈ ప్రోగ్రామునుపయోగించి ఏసంవత్సరం/నెల కి సంబంధించిన చందమామనైనా http://www.ulib.org/ నుంచి దిగుమతి చేసుకోవచ్చు. ఉదాహరణకి మీకు 1965 మార్చి చందమామ కావాలనుకుందాం. మీరు చెయ్యాల్సిందల్లా java -jar Downloader.jar "d:/Chandamama/1965" "1965" "3" అని ఆజ్ఞ(కమాండ్) ఇచ్చి పరిగెత్తించటమే. అదే మీకు 1967లోని అన్ని చందమామలూ కావాలనుకోండి java -jar Downloader.jar "d:/Chandamama/1967" "1967" అని ఇచ్చి పరిగెత్తించాలి(నెల ఇవ్వకుండానన్నమాట). ప్రతీసారి చందమామలు స్టోర్ చెయ్యాల్సిన ఫోల్డరు మాత్రం ఇవ్వటం తప్పనిసరి. ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే ఒక్కొక్క పేజీని డౌన్లోడ్ చేసి, చివరగా అన్నింటినీ కలిపి ఒకే పి.డి.ఎఫ్ గా తయారుచేసి మీరు చెప్పిన ఫోల్డరులో పడేస్తుంది.
P.S. ఇది హడావుడిగా వ్రాసిన ప్రోగ్రామ్. ఎవరైనా దీన్ని improve చెయ్యదల్చుకుంటే సుస్వాగతం. సోర్స్ కోడ్ కూడా వుంది దీన్లో(నేన్రాసినదానికి మాత్రమే సుమా!). నేనైతే 1969 వరకూ చందమామలు దింపుకున్నా ఈ ప్రొగ్రామునుపయోగించి. కాబట్టి కాస్త పనిచేస్తున్నట్లే లెక్క. ఒకవేళ బగ్గులేమైనా మీ దృష్టికి వస్తే blogaagni@gmail.com కి ఒక మెయిలు కొట్టండి. వీలయినంత త్వరగా పరిష్కరించటానికి ప్రయత్నిస్తా. అలాగే ఒకవేళ మీకు జావా ఇన్స్టాల్ చెయ్యటం తెలియక ఈ ప్రోగ్రామ్ ని రన్ చెయ్యటంలో ఇబ్బందులు ఎదురవుతుంటే కూడా ఒక మెయిలు /కామెంటు పెట్టండి.
53 comments:
బ్లాగాగ్ని గారూ, మీకు వెయ్యాల్సిందే ‘వీర చంపి’ తాడు. మంచి ఉపాయం ఇచ్చారు.
నేనూ ఇదివరకు జావా ప్రోగ్రాము ఉపయోగించి vedamu.org సైట్లోంచి సంస్కృత గ్రంధాలు కొన్ని డౌన్లోడ్ చేశాను. మీరూ ఇదే ఉపాయంతో చందమామలు డౌన్లోడ్ చేసేస్తున్నారంటే, జిందాబాద్ కొట్టాల్సిందే.
మంచి అయిడియా, టూల్ ఇచ్చినందుకు మరోసారి కృతజ్ఞతలు.
ఇంకో అయిడియా వచ్చింది. పాపం జావా రాని అజ్ఞానులకి చందమామని చూపించి, ఇదిగో ఇలా జావా డౌన్లోడ్ చేసుకుని, అలా ప్రోగ్రాం రన్ చేసుకో, వచ్చేస్తుంది అని చెప్పి ఊరించి ఏడిపించడం భావ్యమంటారా? ఈ డౌన్లోడర్ ని ఒక చిన్నపాటి GUI application గా తయారు చేసి, దానికి ఒక JRE ని కూడా జతచేసి, ఒక exe ఫైల్ జనాలకి ఇచ్చేస్తే - మీకు ’పరమ వీర చంపి’ బిరుదు ప్రదానం చేస్తామని తెలియజేసుకుంటున్నాం, అధ్యక్షా !!
బాగానే పని చేస్తుంది మీ ప్రోగ్రాము.
మీ ప్రోగ్రాం బాగా పని చేస్తోంది. Source code కూడా చూశాను. చాలా ఓపిగ్గా downloadData ని సేకరించినందుకు మీకు జోహార్లు.
అంతే కాకుండా పీడీఎఫ్ ఫైల్సన్నీ మళ్ళీ ఒకే ఫైలుగా కలిపే పని కూడా మీ ప్రోగ్రాంలోనే చేసినందుకు చాలా కృతజ్ఞతలు.
మొత్తానికి ఇవాళ ‘చంపి’లందరిచేత కేకలు పెట్టించి పండగ చేయిస్తున్నారు.
బ్లాగాగ్ని గారూ,
నా ఆఫీసు లాప్ టాప్ లొ JDK 1.3.1_10 అనుకుంటా.. ట్రై చేసి తిట్టించుకున్నాను..ఇంటికెళ్ళి అర్జంటుగా నా పర్సనల్ PC లో ట్రై చెయ్యాలి 1.6X యిన్స్టాల్ చేసి....
ధాంక్సండీ బాబు....
అహా బోలెడు థాంక్యూ లు బ్లాగాగ్ని గారు ఇంటికి వెళ్ళిన వెంటనే డౌన్‌లోడ్ చేసి చూస్తాను.
నాగమురళి గారూ,
ఆ జావా రాని అజ్ఞానుల్లో ఒకడిగా, నా తరపు నుంచి ఆ ప్రశ్న అడిగినందుకు ధన్యవాదాలు :-)
ప్రదీపు గారు - ప్రోగ్రామ్ ని పరీక్షించి చూసినందుకు ధన్యవాదాలు.
నాగమురళి గారు - కేక పెట్టించే ఉపాయం ఇచ్చారు. కానీ పని వత్తిడిలో తీరిక చేసుకుని ఈమాత్రం కోడు వ్రాయటానికే 20 రోజులపైన పట్టింది. ఇక GUI, EXE, JRE అంటే ఎంతకాలం పడుతుందో :(
ఉమాశంకర్ గారు, వేణు గారు - ధన్యవాదాలు. Happy downloading :)
కుమార్ గారు - :) వ్యాఖ్యానించినందుకు ధన్యవాదాలు.
నేను 1980ల్లోని చందమామలు డౌన్లోడ్ చెయ్యడానికి ప్రయత్నించాను. కొన్ని డౌన్లోడ్ కావడం లేదు. మీరు ఒకసారి ప్రయత్నించి చూస్తారా? 1980 కి ప్రయత్నించి చూడండి.
i could not go ahead at all. pch..
అయ్యా,జావ,సంగటి,గంజి,అంబలి ఇలాంటివి తప్ప మీరనే అ జావా ఏమిటో దాన్ని పరుగెత్తించటం ఏమిటో మాకు తెలీదు కాబట్టి ఆచందమామల్ని నేలమీదకి సులభంగా దించే మార్గమేమిటో కాస్త ఈ సంవత్సరంలోనే మాకు చెప్పండి.
నాగమురళి గారూ,
1970 నుండి దాదాపు 1985/86 వరకు చందమామలు ulib.org లోనే ఓపెన్ అవ్వటం లేదు. ఈ విషయం వాళ్ళకి నేను రిపోర్ట్ చేశాను కానీ ఇప్పటివరకు దాన్ని పరిష్కరించినట్టు లేదు. మీరు డౌన్లోడ్ చెయ్యటానికి ప్రయత్నించిన నెల/సంవత్సరం చందమామ ulib.org లో తెరుచుకుంటుందో లేదో ఒక్కసారి చూడగలరు.
సత్యసాయి గారు, రాజేంద్ర గారు - EXE చెయ్యటానికి ప్రయత్నిస్తున్నానండీ. వీలయితే ఈ సంవత్సరంలోనే మీకివ్వటానికి ప్రయత్నిస్తాను :)
మీ జావా కోడుని .exe కి మార్చాలంటే నాకు తెలిసి ఒక మార్గం ఉంది. .Net Framework J#ను కూడా సపోర్టు చేస్తుంది. మీ జావా సోర్సుకోడు అంతా ఈ J# కంపైలరుతో నేటీవ్ కోడ్ ఎంపికతో కంపైలు చేస్తే .exe తయ్యార్...
(ఇది ఎప్పుడూ నేను ప్రయత్నించలేదు, ఐడియా వస్తేనూ ఇలా కక్కేశా)
తూచ్..తూచ్...
ఆ ఐడియా గురించి మర్చిపోండి. J# అంటే, జావా syntax మాత్రమే, అది ఉపయోగించే లైబ్రరీస్ మరియు API వేరే.
ఐనా జావా కంపైలరులో నేరుగా Target Machine executable format లో కంపైల్ చెయ్యడాని javac.exeలో ఎంపికలు ఏవీ లేవా?
గ్రహాంతర వాసులు బ్లాగుల మీద దాడి చేసినట్లున్నారే?
@kumar: hahahah :)))))
బ్లాగాగ్ని గారు,
మీరు రాసిన script చాలా ఉపయోగించింది. ధన్యవాదాలు. దాని ద్వారా 300 పైగా చందమామలు download చేసాను. అన్ని చందమామలు ఉన్నట్టులేవే. కొన్ని లింకులు పని చెయ్యటం లేదు. ఈ ఇబ్బంది తాత్కాలికమా లేక ఇంక ఆ చందమామలు మనకి దొరకవా? మీకేమైనా తెలుసా?
అన్నట్టు చెప్పటం మర్చిపోయాను, నేను ఒక Perl script రాసి నా దగ్గర లేని వాటికోసం మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాను. ఇప్పటిదాకా నా దగ్గర ఉన్నవి ఇవి. ఎవరికన్నా నా దగ్గర ఉన్నవి కావాలి అంటే పంపిస్తాను. నాదగ్గర లేనివి ఎవరిదగ్గరైన ఉంటే నాకు పంపిస్తే ఆనందిస్తాను.
విధేయుడు,
మెలికల DNA
_____J F M A M J J A S O N D
1947: 0 0 0 0 0 0 1 1 0 1 1 1
1948: 1 0 0 1 0 0 1 1 1 1 0 1
1949: 1 1 0 1 0 0 0 1 0 1 0 1
1950: 1 0 0 1 0 0 0 1 0 1 0 1
1951: 1 1 1 1 1 1 1 1 1 0 1 1
1952: 1 1 1 1 1 1 1 1 1 0 1 1
1953: 1 1 1 1 1 1 1 1 1 0 1 1
1954: 1 0 1 1 0 1 1 1 0 0 0 1
1955: 1 1 1 1 1 1 1 1 1 0 1 1
1956: 1 1 1 1 1 1 1 1 1 0 1 1
1957: 1 1 1 1 1 1 0 1 1 1 1 1
1958: 1 1 1 1 1 1 1 1 1 0 1 1
1959: 1 1 1 1 1 1 1 1 1 1 1 1
1960: 1 1 1 1 1 1 1 1 1 1 1 1
1961: 1 1 1 1 1 1 1 1 1 0 0 1
1962: 1 1 1 1 1 1 1 1 1 1 1 1
1963: 1 1 1 1 1 1 1 1 1 1 1 1
1964: 1 1 1 1 1 1 1 1 1 1 1 1
1965: 1 1 1 1 1 1 1 1 1 1 1 1
1966: 1 1 1 1 1 1 1 1 1 1 1 1
1967: 1 1 1 1 1 1 1 1 1 1 1 1
1968: 1 1 0 1 1 1 1 1 1 1 1 1
1969: 1 1 1 1 1 1 1 1 0 0 0 0
1970: 1 1 0 0 0 0 0 0 0 0 0 0
1971: 0 1 0 0 0 0 0 1 0 0 0 0
1972: 0 0 0 0 0 0 0 0 0 1 0 0
1973: 0 1 0 1 0 0 0 1 1 0 0 0
1974: 0 0 0 0 0 0 0 0 0 1 0 0
1975: 0 0 0 0 0 0 0 1 0 0 0 1
1976: 0 0 0 1 0 0 0 0 0 0 0 0
1977: 0 0 0 0 0 0 0 0 0 0 0 0
1978: 0 0 0 0 0 0 0 1 0 0 0 1
1979: 0 0 0 0 0 0 0 0 0 1 1 0
1980: 0 0 0 0 0 0 0 0 0 0 0 0
1981: 0 1 1 1 1 1 1 1 0 0 0 0
1982: 1 0 0 0 0 0 0 1 0 0 0 1
1983: 0 0 0 0 1 0 0 0 1 1 0 1
1984: 0 0 0 1 0 0 0 0 0 1 1 0
1985: 0 0 0 0 0 0 0 0 0 0 0 0
1986: 0 0 0 0 0 1 1 1 1 1 1 1
1987: 1 0 1 1 1 1 1 1 1 1 1 1
1988: 1 1 1 1 1 1 1 1 1 0 0 1
1989: 0 1 0 1 1 0 1 1 0 0 1 1
1990: 1 1 1 1 1 1 1 1 0 1 1 1
1991: 1 1 1 1 0 1 1 1 1 0 0 1
1992: 1 1 1 1 0 1 1 1 1 1 1 1
1993: 1 1 1 1 1 1 0 1 1 1 1 1
1994: 1 1 1 1 1 1 1 0 1 1 1 0
1995: 1 1 0 0 0 1 1 1 1 1 1 0
1996: 0 0 0 0 0 1 0 1 1 0 0 0
1997: 0 0 0 1 1 0 1 1 1 1 0 1
1998: 0 1 0 0 1 0 0 0 0 0 0 0
1999: 0 0 0 0 0 0 0 0 0 0 0 0
2000: 0 0 0 0 0 0 0 0 1 0 0 0
2001: 0 0 0 0 0 0 0 0 1 0 0 0
2002: 1 1 1 1 1 0 0 0 0 0 1 0
2003: 0 0 0 0 0 0 1 1 1 1 1 1
2004: 0 1 0 0 0 0 0 0 0 1 0 0
2005: 0 0 0 0 0 0 0 0 0 0 0 0
2006: 0 0 0 0 0 0 0 0 0 0 0 0
2007: 0 0 0 0 0 0 0 0 0 0 0 0
2008: 0 0 0 0 0 0 0 0 0 0 0 0
మెలికల DNA గారూ,
I have downloaded చందమామలు using బ్లాగాగ్ని ప్రోగ్రాం.
Pl. note that 48 Dec. is actually 49 Dec.
1962 April issue is actually
Dec. 59. చూడండి.
I have some editions which you don't have. vise versa.
Yes. Tell me the way to share the missed ones.
... వేణు.
hi Venu garu
if u have any of the below Chandamama issues
1961: oct, nov
1962: apr
1968: mar
1969: sep, oct, nov, dec
1970: except jan, feb
1971: except feb, aug
1972: except oct
1973: except apr, aug, feb, sep
1974: except oct
1975: except dec, aug
1976: except apr
1977: all
1978: except dec, aug
1979: except oct, nov
I want the above issues plz if u have share it
Vishu garu,
(lekhini ki velli Telugu rayatam marosari chesta, Pl.excuse me all.)
చందమామలు you have mentioned are not with me. I wish to have them too.
We must Be grateful to బ్లాగాగ్ని garu for the downloader programme which he gave for us. మరోసారి కృతజ్ఞతలు.
నాగమురళి గారూ, For u too for your treasure hunt!
By the way... Vishu garu,
You did not mention pre 61 year issus and past 1980 issues. Do you have the following...?
1948: Dec. (It is really 49 Dec at ulib.org)
1950: July
1980: all editions
1981: Jan, Sept, Oct, Nov, Dec.
1982: except Jan, Aug, Dec.
1983: except May.
1984: except April, Oct, Nov.
1985: all editions.
1986: Jan, Feb, March, April, May.
1987: Feb.
1988: Oct, Nov.
1989: Jan, Mar, June, Sept, Oct.
1990: Sept.
(I confine till 1990)
1948 Dec. issue is with TRIVIKRAM, according to his blog post. Let us ask him to make it digitalise and share for us!!!!
.... వేణు.
Hi Venu Garu
Am having 1948: Dec and 1950: July. plz tell me How can i share them? i will share them. and anybody have balamitra, balajyothi etc books.
Vishu
బ్లాగాగ్ని గారూ,
మీకు జోహార్లు, మహావీర చం.పి. తాళ్ళు!! గత రెండు నెలలుగా నేను అంతర్జాలానికి, అందునా బ్లాగులోకానికి దూరంగా ఉండి చాలా మిస్సైపోయాను.
వేణుగారూ,
(డిసెంబరు 1948 గురించి)నేను chandamama.com నుంచి ఫ్లాష్ ఫైళ్ల స్క్రీన్ షాట్లు తీసుకుని ఒక్కోపేజీ విడిగా కత్తిరించుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు బ్లాగాగ్ని గారిచ్చిన సోర్స్ కోడును వాడి వాటన్నిటినీ కలిపి ఒకే పీడీఎఫ్ గా మార్చాను. దాదాపు 10 MB ఉంది. తోటి చంపిలతో పంచుకోవడానికి అభ్యంతరం లేదుగానీ ఆ పంచుకునే మార్గం చెప్పగలరు.
త్రివిక్రం గారూ, విషు గారూ ధన్యవాదాలు.
షేరింగ్ విషయం బ్లాగాగ్ని గారు చెప్పాలి.
... వేణు
Venu garu trivikram garu evari daggara naina balamitra, balajyothi etc unnaya plz unte share cheyandi
Vishu
త్రివిక్రం గారూ,
www.rapidshare.com అనే సైట్లో అప్లోడ్ చెయ్యవచ్చు. ప్రయత్నించండి.
And one more random thought. Seems Delhi IIIT guys manage these servers where the chandamama books are hosted. They have a forum @ http://dli.iiit.ac.in/cgi-bin/teemz/teemz.cgi?board=_master Since many books in 70s, 80s and 90s are missing, I placed a request there to correct those links. You can also try posting a request in that forum regarding the missing books. Just hoping that more requests will expedite the process :) You can find my request in Feedback section.
Hi
Chandamama Dec 1948 link
http://rapidshare.com/files/190100861/Dec_1948.zip.html
Another link
July 1950 Chandama
http://rapidshare.com/files/190110489/July1950.pdf.html
plz if anyone have balamitra, balajyothi plz upload
Vishu
విషు గారూ!
Thank you very much for sharing Dec 48 and July 50 Chandamama issues. I have downloaded them now.
... వేణు.
బ్లాగాగ్ని గారూ!
http://dli.iiit.ac.in/cgi-bin/teemz/teemz.cgi?board=_master
లో టపా రాశాను. మన మిత్రులు కూడా స్పందించాలని విన్నపం.
అన్నట్టు...మీ దగ్గర ఈ చందమామలు ఉంటే షేర్ చెయ్యమని కోరుతున్నాను.
1961: Oct, Nov.
1962: April
1968: March
1969: Sep,Oct,Nov, Dec.
... వేణు.
REVISED for last post...
బ్లాగాగ్ని గారూ!
http://dli.iiit.ac.in/cgi-bin/teemz/teemz.cgi?board=_master
లో టపా రాశాను. మన మిత్రులు కూడా స్పందించాలని విన్నపం.
అన్నట్టు...మీ దగ్గర ఈ చందమామలు ఉంటే షేర్ చెయ్యమని కోరుతున్నాను.
1948: Nov.
1961: Oct, Nov.
1962: April
1968: March
1969: Sep,Oct,Nov, Dec.
ముఖ్యంగా నవంబరు 1948 సంచిక నా దగ్గర లేదని లేటుగా గుర్తించాను. అది ulib.org, chandamama.com లో దొరకటంలేదు. Please share above editions.
... వేణు.
Venu garu
Here is the link for chandamama nov 1948 enjoy.
http://rapidshare.com/files/193612850/Nov_1948.pdf.html
Venu garu do u have any other old books?
Waiting for ur reply
Vishu
విషు గారూ!
చాలా చాలా ధన్యవాదాలు.. 48 నవంబర్ చందమామ పంపినందుకు. నా దగ్గర బాలమిత్ర, బాలజ్యోతి సంచికలు లేవండీ. బాలమిత్రలో మ్రుత్యులోయ సీరియల్
బాగుండేది. అది పుస్తకరూపంలొ నా దగ్గర ఉంది. 2 మినీ పుస్తకాలు.
... వేణు.
విషు గారూ!
'Mruthyu Loya' Balmitralo kaadu, Bommarillulo kaduu?
Heros names... Yashapaaludu, Jakethudu.
... వేణు.
Hi venu garu
Pustaka rupam lo unna paravaledhu. balamitra, balajyothi lekapoina bommarillu patha cinema pusthakalu etc evunna paravaledhu. mee daggaraki vachi nenu chisukuntanu. Meeru ekkada untaru?
Waiting for ur reply?
Vishu
Vishu garu!
Do you assume me as a rare books'collector? I am just a book lover.
any way I reside in Hyd.
e-mail: venueenadu@yahoo.co.in. I
would like to know your mail ID.
Thank you.
వెణుగారూ,
మృత్యులోయ ధారావాహిక బాలమిత్రలో కాదండి. బొమ్మరిల్లు లో. బొమ్మరిల్లు పత్రిక మొదటి ధారావాహిక ఇది. మీరు చెప్పినట్టు బొమ్మరిల్లు వారు ఆ ధారావాహికను పుస్తకంగా కూడ విదుదల చేశారు
ఇదే విధంగా చందమామ వరు కూడ వారి ధారావాహికలన్నిటిని పుస్తకరూపంగా ఎందుకు వెయ్యరో మరి. చందమామ ధారావాహికలు ఉన్న డిమాండు మార్కెట్ మరే ఇతర బాల సాహిత్యానికి లేదని నా అభిప్రాయం. ంఅరి చందమామ వారు గమనిస్తున్నరో లేదో తెలుయదు.
శివరామప్రసాదు కప్పగంతు
బెంగుళూరు నుండి
శివరామప్రసాదు గారూ,
చందమామ ధారావాహికలు తొలినాళ్ళలో పుస్తక రూపంలో వచ్చాయి. ‘విచిత్ర కవలలు’ అలాగే పుస్తకరూపంలో విడుదల చేశారు. (ఆ పుస్తకంలో... ధారావాహికలో వాడిన బొమ్మలన్నిటినీ- ఆశ్చర్యకరంగా యథాతథంగా ఇచ్చారట).
తర్వాత చందమామ యాజమాన్యం ఈ సంగతి పట్టించుకున్నట్టు కనపడదు.
పున: ప్రచురణలు చేస్తున్నారు కాబట్టి బహుశా పుస్తకరూపంలో ఇవ్వకూడదని భావించివుండాలి.
వేణుగారూ,
మీరు చెప్పిన విషయం నాకు వార్త సుమా!! ఇంతవరకు నాకు తెలియదు చందమామల ధారావహికలు పుస్తక రూపంలో వచ్చాయని. ముద్రణ పున:ముధ్రణ అయిపొయ్యాయి కాబట్టి, ఇప్పటికైనా, చందమామ యాజమాన్యం వారి ధారావాహికలన్నిటినీ, మొత్తం బొమ్మలన్నిటితోనూ( బొమ్మలు లేకప్పొతే ఆ ధారావాహీకలు ప్రాణం లేదు) ప్రచురిస్తారని ఆశిద్దాం. లేదంటే, కనీసం 1947 నుండి చందమామలన్నిటిని 1980 వరకు సాప్ట్ కాపీలను డివిడి లుగా వేసి అమ్మవచ్చు. 1980 తరువాత చందమామ క్షీణించటం మొదలయింది. చిత్ర మరణం, తరువాత చక్రపాణి నిర్యాణం ఆ తరువాత కొడవటీగంటి వళ్ళిపోవటం చందమామ ను హీన స్థితికి తెచ్చినాయి. మళ్ళీ పాత ఉచ్చ స్థితికి వెళ్ళటం, తీసుకునిరావటం దాదాపు అసాధ్యం.
శివరామప్రసాదు గారూ!
కిందటి సంవత్సరం ఆగస్టు ‘రచన’ సంచిక ఎక్కడైనా దొరికితే చూడండి. చందమామ 60 ఏళ్ళ సందర్భంగా వేసిన ప్రత్యేక పంచిక అది. దానిలో ‘విచిత్ర కవలలు’ పుస్తక ముఖచిత్రం వేశారు.ఇంకా చందమామకు సంబంధించిన చాలా విశేషాలు రాశారు.
త్రివిక్రమ్ గారు ఓ టపాలో ఈ ధారావాహికలను పుస్తకాలుగా ప్రచురించిన సంగతిని ప్రస్తావించారు.
చందమామకు పూర్వవైభవం రాదనేది వాస్తవమే అయినా, అది అప్రియ సత్యం.
బ్లాగాగ్ని, మీకు ధన్యవాదము.
చాలా ఓపికగా చందమామ URL సేకరించినందుకు..
నేను ౧౯౬౨ వరకు మాత్రమే సేకరించాను.
మిగతావి మీ program లోవి తీసుకున్నాను.
నేను కూడా, చందమామ పుస్తకాలు download చెయ్యటానికి java program వ్రాశాను with GUI.
Digital library of india నుంచి కూడా పుస్తకాలు download చెయ్యొచ్చు.
http://bhuvanavijayamu.blogspot.com/2009/06/how-to-download-chandamama-other-books.html
sorry andi....nenu mee site ki latega vacca....
argue cheyyanu....
MURALI garila maa lanti vallu...VUNTARU...
ANYWAY....
PAPAM..JAVA RAANI...AGNNAMULAM memu....
http://cid-f86920f00c727cd1.skydrive.live.com/browse.aspx/%E0%B0%9A%E0%B0%82%E0%B0%A6%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AE
tanu chooodu....ela pettado....tana daggara vunnavi pettadu....BLAGANNI GARU meeru kooda inte....
NAGAMURALI type kakunda maa lanti AGNAANULU vastaru...vuntaru....valla kosam oka direct link pettandi...downloadi ki....
emole....
needi goppa site...
blagaagni gaaru, nenu downloader ni run chesunappudu file is not available in www.ulib.org ani vasthondi.
mar e folder lo save cheyalo ela cheppali
ajjibaaboy, inni chandamaama kathalu yekkadi nunchi thechcharandee baboo... norooripothondi...kaani exams unnayi...pchchch...paapam ani na meeda naaku chala jaali vestondi..
december daaka theerika ledu....inka yee blog vaipu december varaku choodanu kaaka choodanu...naa meedottu...
The programmee given by Phani (JRE)
with downloader.bat is working, but many are not comong. So far I have tred 1947,1948, 1949,1950 years. I have got 6,7,8,10,11,12 in 1947, and 1,10,12 in 1948. In 1949, 1950 i am not able tt get even one issue.
But as per Melicala DNA list these are available. Anybody help me?
TSR
The programmee given by Phani (JRE)
with downloader.bat is working, but many are not comong. So far I have tred 1947,1948, 1949,1950 years. I have got 6,7,8,10,11,12 in 1947, and 1,10,12 in 1948. In 1949, 1950 i am not able tt get even one issue.
But as per Melicala DNA list these are available. Anybody help me?
TSR
It is reliably learnt that pdf files of old Chandamamas were removed both from Chandamama website and Ulib.org because of which although Phani's programme is very much working, no download is happening.
Mr.Phani may help us. If really these issues not available in ulib.org, I am requesting readers who already downloded Chandamamas pl.help
TSR
phani garu meeru icchina downloader pani cheyyatledu..okka issue kooda download avvdam ledu..meeru rapidshare lo anna..leka torrents lo anna me daggara unna chandamamalu upload cheste..chala baguntundi..memu meeku runapadi untam...
dhanyavadamalu
I have tried tto download one book. But where it is getting saved I am not finding. Please help me.
Umasri
Post a Comment