Thursday 18 March, 2010

యువ నట వారసులు

ఇవి చాలా వరకూ తమిళ హీరోల మీద నేను వివిధ సైట్లలో చదివిన జోకులు. ఇవి మన యువ నట వారసులకు ఎందులోనూ తీసిపోవనిపించి ఇలా కొంచెం మార్చి వ్రాస్తున్నాను.


1. ( యువ నట వారసుడు నటించిన సినిమా ఆడుతున్న థియేటర్ బయట జనాల గుంపులను చూస్తూ)

దానయ్య 1: అబ్బో ఏంటండీ ఇంత జనం. సినిమా అంత బావుందా?

దానయ్య 2: అంత లేదు. ఎవడో సినిమాకి అడ్వాన్స్ బుకింగ్ టిక్కెట్లకై వచ్చాడట. వాణ్ణి చూడటానికి జనం విరగబడుతున్నారంతే.


2. యువహీరోగారి సినిమా విడుదలైన రెండ్రోజులకే డబ్బా తిరిగొచ్చేసే చిహ్నాలు కనిపిస్తున్నాయి. పరిస్థితుల్లో ఆశ్చర్యకరంగా నిర్మాత "మా సినిమాకు ఆంధ్రప్రదేశ్ అంతటా అన్ని థియేటర్లలోనూ ప్రవేశం ఉచితం" అని ప్రకటించాడు. ఊహించినట్టే మర్నాడు మార్నింగ్షోకి జనాలు ఎగబడ్డారు. అందర్నీ లోపలికి రానిచ్చిన తరువాత చల్లగా ప్రకటించాయి థియేటర్ వర్గాలు, "ప్రవేశం ఉచితమే, కానీ బయటకు వెళ్ళాలంటేనే వెయ్యి రూపాయలు పెట్టి టిక్కెట్ కొనాలి" అని. జనాలు ఎగబడి టిక్కెట్లు బ్లాకులో కొనుక్కుని మరీ పారిపోయారు, ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని. నిర్మాతకు మరో రెండు యువహీరో సినిమాలు తియ్యటానికి సరిపడా డబ్బొచ్చింది.3. బస్సులో ముఫ్ఫైమంది, వానులో పదిహేనుమంది, సుమోలో ఎనిమిదిమంది, కారులో ఆరుగురు కూర్చోగలరు.

కానీ ఒక్కడు కూడా కూర్చుని మన యు..వా. సినిమా చూడలేడు.


4. యు..వా.:(వాచి షాపులో) ఒక మంచి వాచి చూపించండి.

దుకాణాదారు: ఇదుగోండి. ఇది చాలా మంచి కంపెనీ.

యు..వా.: బాగా ఆడుతుందా?

దుకాణాదారు: , మీరు నటించిన సినిమాలకన్నా బానే ఆడుతుంది5.చంద్రముఖి - స్ప్లిట్ పర్సనాలిటీ

అపరిచితుడు - మల్టిపుల్ పర్సనాలిటీ

యువ నట వారసుడు - నో పర్సనాలిటీ.

20 comments:

Rajendra Devarapalli said...

@5 :) :) :) :) :)

కొత్త పాళీ said...

4 & 5 .. super!!

బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ said...

హిహి...హి

పానీపూరి123 said...

1... :-)

చదువరి said...

అన్నీ అదరహో నండి. అయితే ఆ రెండోది ఉందే.. అది మాస్టరుపీస్!

చిలమకూరు విజయమోహన్ said...

:D

రమణ శర్మ ధూర్జటి said...

చాల రోజుల తరువాత ! ఓకే, అన్ని చాలా బాగున్నై

పరిమళం said...

:) :)

praveen kadali said...

nice blog keep it up anna

Murthy Ravi said...

ninnati naadu eenaadu lo chusi eenaadu open chesaa.. bavundi..

4. యు.న.వా.:(వాచి షాపులో) ఒక మంచి వాచి చూపించండి.

దుకాణాదారు: ఇదుగోండి. ఇది చాలా మంచి కంపెనీ.

యు.న.వా.: బాగా ఆడుతుందా?

దుకాణాదారు: ఓ, మీరు నటించిన సినిమాలకన్నా బానే ఆడుతుంది

ee joke lo watch ni aaduthundaa? ani adagadam correct gaa anipinchale... tamil lo watch ki cinemaki oke word use chestaremo theleedu.

"nadusthundaa" use chesukovachchemo....

ప్రణీత స్వాతి said...

కంగ్రాట్స్ అండీ..మీ బ్లాగాగ్ని జ్వాలలు ఈవేళ ఈనాడు ఈ తరం లో కనిపించాయి.

GOUTHAMARAJU said...

మంచి ప్రయత్నం.
కంగ్రాట్స్! బ్లాగాగ్ని జ్వాలలు ఈవేళ ఈనాడు ఈ తరం లో కనిపించాయి.

బ్లాగాగ్ని said...

Thanks a lot to all of the commentators for your wishes :)

Krishna Karthik said...

congratulations
your blog has been published on eenadu news paper i came here after see on paper on saturday

satmukka said...

చాలా బాగుంది.

ధన్యవాదములు

మీకు (ఎవరైనా సరే) వీలైతే నా బ్లాగు కూడా చూడండి. (http://telugupilladu.blogspot.com/)

Unknown said...

chala bagunnayi nee jokes

Sandeep P said...

good ones :)

మూడో పురుషార్థమ్ said...

Good.. So funny post..

Afsal m n said...

Nice letters ...Which language is this?

Free Softwers Download with Fullversion keys said...

I found your blog on google great information about Eenadu

Thanks for share...........