Thursday, 25 September, 2008

ఒక సినీ కవి రెజ్యూమె

చదువు - నాట్ అప్లికబుల్

అనుభవం - పది తమిళ డబ్బింగు సినిమా పాటలని తెలుగులోకి ముక్కస్య ముక్కానువాదం చేసిన అనుభవం.

బలాలు/అర్హతలు -

1. హీరోగారి వంశానికి తగినట్లు పాటని మార్చి వ్రాయగల సామర్ధ్యం.

2. కేవలం అయిదంటే అయిదు తెలుగు పదాలతో పాట వ్రాయగల పాండిత్యం.

3. బొంబాయి భామలు, మళయాళ ముద్దుగుమ్మలు పెదాలు కదిల్చేందుకు కష్టపడక్కర్లేకుండా అతి సులువైన పదాలతో పాట వ్రాయగల ఘనత.

4. సెన్సారుబోర్డుకి (ఒకవేళ వుంటే...!) దొరక్కుండా పాటలో ద్వంద్వార్థాలు/ఏకార్థాలు జొప్పించగలిగే నైపుణ్యం.

5. ఎటువంటి దరిద్రపు బాణీకయినా పాట వ్రాయగల సత్తా(మచ్చుకి ఇటీవల ప్రముఖ సంగీత దర్శకుడు వక్రి గారి కొత్త సినిమా పుండాకోర్ లో వారి చావుడప్పు బాణీకి అనుగుణంగా వ్రాసిన పాట)

16 comments:

చంద్ర శేఖర్ కాండ్రు said...

"సంగీత దర్శకుడు వక్రి గారి కొత్త సినిమా పుండాకోర్"

అదిరింది.

చైతన్య said...

బాగుంది. మీ "కవి గారి రెజ్యూమె".

కత్తి మహేష్ కుమార్ said...

డబ్బింగ్ సినిమా చేద్దాంరా!

సుజాత said...

దేనికదే అద్భుతంగా ఉన్నాయి అర్హతలు. మొదటిది మరీ! మహేష్ గారేదో ప్రపోజల్ పంపారు చూడండి!

ఉమాశంకర్ said...

బావుంది.

సినీ సాహిత్యం మీద నేను ఆశలు ఎప్పుడో వదిలేసుకున్నా. రాజీ పడకుండా రాసేవారు ఒకరిద్దరు ఇప్పటికీ ఉన్నారనుకోండి. 90 శాతం అంతా చెత్తే.

Purnima said...

హహహ.. భలే భలే!

ఇవ్వాల పొద్దున్న ఎఫ్.ఎంలో పాటలు వింటూ ఇక నేనూ పాటలు రాసేయచ్చు అని నిర్ణయించేసుకున్నాను. ఇప్పుడేమో కాపీ పేస్ట్ కి మీరేమో రెస్యూమే పెట్టేశారు. అన్నీ ఇలా కలిసి వస్తున్నాయన్న మాట!

రిషి said...

హహ...బాగుంది.

unfortunately...ఇలాంటి క్వాలిఫికేషన్స్ వున్న రైటర్స్ మనకి కుప్పలు...కుప్పలుగా ఉన్నారు. అందులో..

'తలుకు తలుకు తలుకు మంది...సరుకు ' అని పాట రాసిన మహనీయుడు మా వూరివాడే !!

బొల్లోజు బాబా said...

ఎందుకు సారు అలా ఆడిపోసుభకుంటారు.
వాళ్లకుండే సమస్యలు వారికుంటాయి.

అంతటి వత్తిళ్లలోనూ అప్పుడప్పుడు మంచి చమక్కులు వినిపిస్తున్నారు గా (ఫీల్డులో ఉన్నవారందరూ ఏ వక్కరో ఇద్దరో కాదు)

ఒక పాట ఒక కవిపేరు మీద బయటకు వచ్చినతరువాత అందులోని చెత్తకంతటికీ అతనేభాధ్యుడవుతాడు. నిజమే. కానీ కవన్నవాడు తనంతట తానుగా తన పిల్లల ఎదుట చదవటానికి ఇబ్బందిగా ఉండే విషయాలు వ్రాస్తాడని నేననుకోను. దాని వెనుక కొన్ని హస్తాలు ఉంటాయి. ఇదే విషయాన్ని వేటూరి వారు ఎన్నోసార్లు వాపోయారు.

ఒక కవి మంచి వాక్యం వ్రాసినప్పుడు అభినందించిన మనం, అతడో చెడ్డ వాక్యం వ్రాసినప్పుడు వేంటనే మీదపడి ఎకసెక్కాలాడకుండా ఎందుకు ఇలా రాసాడో పాపం అని కంపాసన్ ఎందుకు చూపలేం?

వ్యక్తీకరణ ఘాటుగా ఉంటే క్షమించండి. నేచెప్పదలచుకొన్న విషయాన్ని గ్రహించండి.

బొల్లోజు బాబా

రాధిక said...

టపా కామెడీగా బాగుంది.
బాబాగారు చెప్పినమాట నిజం.కవి వెనుక ఎన్ని హస్తాలుంటాయో నాకీమధ్యనే అనుభవమయింది.బయటకి వచ్చిన పాట మాత్రం ఖశ్చితంగా కవి మనసులోని భావం మాత్రం కాదు.

అబ్రకదబ్ర said...

టపా పటాసులా పేలింది. అంటించింది బ్లాగాగ్ని మరి!

ఆ మధ్య ఎఎమ్‌రత్నం వంటి డబ్బింగు వీరులు 'కవులకి విడిగా డబ్బెందుకూ వేస్టు, అదేదో నేనే రాసేస్తే పోలా' అనుకుని తమిళ పాటల్ని మక్కీకి మక్కీ అనువదించెయ్యటం మొదలెట్టారు. అలా తెలుగులోకి దిగుమతైనవే 'అయ్యారేటు', 'పుడింగి', 'పోడా మచ్చి' లాంటి మాటలు. అన్నిటికన్నా అదుర్స్: 'స్ట్రాబెర్రీ కళ్లు'. (ఎన్ని అనువాదప్పాటల్లో ఆ మాట వినుంటారో సరిగా చెప్పినోళ్లకి కేజీ స్ట్రాబెర్రీలు బహుమతి). వీళ్లని చూసి కాస్తో కూస్తో డొక్క శుద్ధి ఉన్న కవులు కూడా 'మరీ అంత కష్టపట్టం దేనికీ, మనమూ అదే పని చేస్తే పోలే' అనుకున్నట్లున్నారు. ఇది మెల్లిగా డవిరెక్టు చిలమాలకీ పాకింది.

రఘుమాన్ (తమిళులు తప్ప మిగిలినోళ్లంతా ఈయన్ని రెహమాన్ అంటారు) సంగీత దర్శకత్వం వహించిన ఎన్నో అద్భుతమైన మెలొడీ పాటలు రత్నం లాంటి అనువాదకుల చేతిలో పడి మసైపోయాయి.

ఉమాశంకర్ said...

సరే లెండి, వంద పాటల్లో ఒక మంచి పాట వస్తే సంతోషపడటం, అదీ ప్రస్తుత పరిస్థితి. సర్దుకుపోదాం..

Anonymous said...

మీరు మర్చిపోయినవి:

ఖండాంతర ఖ్యాతి:
ఇరవై రెండు సార్లు అమెరికా, దుబాయ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యటనలో ఎన్నారైలందర్నీ తన వాక్చాతుర్యంతో (అంటే బూతులు మాట్లాడుతూ)అదరగొట్టడం.

[ఎన్నారై లకి లేని సిగ్గు నాకేల? వాళ్ళు బుర్రలేకుండా నన్ను స్పాన్సర్ చేస్తే నేను వెళ్ళేను ఫ్రీ దారిఖర్చులతో. వచ్చేటప్పుడు వాచీ, దిజికేం అవి కొనుక్కుతెచ్చుకున్నాను అది వేరే సంగతి]

వేణూ శ్రీకాంత్ said...

టపా అదిరింది బ్లాగాగ్ని గారు,
రత్నం శివగణేష్ ఇద్దర్ని ఒకే కుర్చీకి అటుఇటు కట్టేసి వాళ్ళ పాటల్నే వాళ్ళకి చదివి వినిపించాలి, దెబ్బకి శని వదిలిపోతుంది.

బ్లాగాగ్ని said...

చంద్రశేఖర్, చైతన్య, సుజాత, ఉమాశంకర్, పూర్ణిమ, రిషి, రాధిక, అబ్రకదబ్ర, వేణూ శ్రీకాంత్ మరియు అనానిమస్ - టపా చూసినందుకూ, వ్యాఖ్యానించినందుకూ ధన్యవాదాలు.

మహేష్ - మీరు క.స్క్రీ.హీ.మా.పా.ద చేసేటట్లయితే చెప్పండి, డబ్బింగేం ఖర్మ డైరెక్టు సినిమాయే చేసేద్దాం.

బాబా - ఈమాత్రం దానికే క్షమాపణల దాకా ఎందుకండీ. నాకు మీ భావమూ, బాధా రెండూ అర్థమయ్యాయి. మంచి కవులు లేరని నాఉద్దేశ్యం కాదు. కాకపోతే ఇప్పటి మార్కెట్ డిమాండుకు తగినట్లు కవిగారు రెజ్యూమె తయారు చేసుకున్నారు అంతే :).

aradhana said...

sir , u r resume have been shortlisted for oscar films,are u willing to do night shifts

Mohanpublcations / Granthanidhi said...

1000+telugu free ebooks
WWW.MOHANPUBLICATIONS.COM