మధ్యాహ్నం పన్నెండు గంటల సమయం - ఈ సమయం ఇరవయ్యేళ్ళ క్రితం, నలభై లేక అరవై ఏళ్ళ క్రితం ఎలావుండేదో తెలియదుగానీ ఇప్పుడు మాత్రం ఇది మనకున్న లక్షా తొంభై ముదనష్టపు ఛానెళ్ళు ప్రసారం చేసే ముష్టి వంటలని ఇంట్లోని ఆడవాళ్ళు నోరు తెరుచుకుని చూసే సమయం. అలాంటి పన్నెండు గంటల సమయం లో ప్రసారమయ్యే ఒక వంటల కార్యక్రమం, కెమెరామాన్ స్వగతంతో కలిపి మీకోసమే ప్రత్యేకంగా.
********
టైటిల్ గ్రాఫిక్ అయిపోగానే బుల్లితెర మీద యాంఖరి ప్రత్యక్షమై వాగటం మొదలు పెట్టింది "నమస్కారం. గజిని చానెల్లో టెలికాస్ట్ అయ్యే "మీ పేట కూ.......క్ oట" కార్యక్రమానికి స్వాగతం. మీకు తెలుసు చాలా డేస్‌గా ఈ ప్రోగ్రాం దేశాలు పట్టుకు తిరుగుతూ ఇప్పుడు అమెరికాలోని అడుక్కుంటాన్ నగరానికొచ్చింది. ఇప్పుడు ఈనగరంలో మనకు ఎవరు వంటచేసి పెడతారో అడుక్కుందాం రండి". కాసేపు కెమెరాలో అడుక్కుంటాన్ నగర వీధుల్ని చూపించాక, మళ్ళీ యాంఖరి పళ్ళికిలిస్తూ చెప్పసాగింది "వావ్, మొత్తనికి మనకు వంట చేసి పెట్టటానికి ఒక టేల్గూ ఫామిలీ దొర్కింది. ఇప్పుడు వాల్లింటికే ఎల్దాం రాన్డి."
కట్ చేస్తే, ఒళ్ళంతా దిగేసుకున్న ఒక నగల దుకాణం ఓనరిణి స్లోమోషన్లో యాంఖరి చేతికి ఒక వేపమండల కట్టలాంటిది ఇచ్చి స్వాగతం చెప్తోంది. సందేహాల్రావైన మన కెమెరామాన్‌కి అదేంటో అర్థం కాక జూం చేసి చూస్తే మొత్తం కట్టలో ఎక్కడో రెండు గడ్డిపూలు కనిపించాయ్.
కెమెరామాన్ స్వగతం : "ఓహో, ఇది బొకే అన్నమాట"
యాంఖరి ఇక మొదలెట్టింది "నమస్కారం అండీ, మీ పేరు చెబుతారా" ఓనరిణి చెవుల్దాకా సాగతీసి నవ్వుతూ, కెమెరా వైపు తిరిగి చెప్పింది "హాయ్, దిస్ ఈజ్ డాకిని బజ్జి". యాంఖరి కాస్త కన్ఫ్యూజ్ అయ్యి రహస్యంగా ఓనరిణి చెవిలో చెప్పింది "మీరు చేసే వంట పేరు తర్వాత చెబుదురుగాని, ముందు మీ పేరు చెప్పండి". ఓనరిణి అదే నవ్వు మొహంతో కెమెరాలోకి చూస్తూ చెప్పింది "నా పేరు మందాకిని, ఇంటిపేరు బజ్జి. యూ.ఎస్ వచ్చాక మోడ్రన్‌గా ఉండాలని ఎం.దాకిని బజ్జి అని పిలిపించుకోవటం మొదలుపెట్టాను. అమెరికన్స్‌కి నోరు తిరక్క డాకిని బజ్జి అని పిలవటం మొదలుపెట్టారు. అలా నాపేరు డాకిని బజ్జి అయిపోయింది".
కె.స్వ. : "అర్థం తెలియకపోయినా ఈ అమెరికన్లు నీకు సరైన పేరే పెట్టారు."
అంతా విన్న యాంఖరి ఆనందభాష్పాలు రాలుస్తూ "వావ్ సో నైస్ అండీ, మీ నేం స్టొరీ. ఇక మనం వంట స్టార్ట్ చేద్దామా? మీరు చేసే వంట పేరు చెఫ్ఫండి" అన్నది. డాకిని తన చేతిలో సిధ్ధంగా ఉంచుకున్న కాగితం తీసి పైకి చదివింది "కాకరకాయ చీరి మిరియాలపొడి కూరి నూనెలో దేవి పంచదార వేసి చింతపండు కలిపి పాలు పోసి కూర"
కె.స్వ. : ఓసి నీయమ్మ కడుపు కాల. నువ్వు వంట పేరు చెబుతున్నావా లేక దాంట్లో వాడే పదార్ధాల లిస్టు చదువుతున్నావా. అందుకా చీటీలో రాసుకొచ్చావ్,
యాంఖరి ఆనందభాష్పాలు ఆగటంలేదు "వావ్! వింటూంటేనే నోరూర్తోందండీ. అయితే వంట మొదలుపెట్టేముందు ఒక చిట్కా తెలుసుకుందాం"
కెమెరా మరో యాంఖరి మీదకు ఫోకస్ అయ్యింది. "అందరికీ ఉబలాటంగా ఉంటుంది కదండీ, మనమెంత గట్టిపిండమో తెలుసుకోవాలని. మీ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఇలా చెయ్యండి. పొద్దున్నే లేవగానే అరికాళ్ళకి అరిచేతిమందాన ఆముదం రాసుకుని తడినేల మీద అరవై కిలోమీటర్ల వేగంతో పరిగెత్తండి. మొదటి రోజు మీకేంకాకపొతే రెండో రోజూ ట్రై చెయ్యండి. రెండో రోజూ బానే వున్నారా, ముచ్చటగా మూడో రోజు ప్రయత్నించండి. ఇంకా ఏమీ కాకపోతే మీరు నిజంగా చాలా గట్టి పిండం. వెంటనే మాకు జి.పి అని టైప్ చేసి ఎస్.ఎం.ఎస్. చెయ్యండి, మా వంటల ప్రొగ్రాంలో చేసే వంటలు రుచి చూసే ఉద్యోగం మీలాంటి వారికోసమే ఎదురుచూస్తోంది."
"వెల్కం బ్యాక్ టూ "మీ పేట కూ.......క్ oట" ఇప్పుడు ఈ కూర ఎలా చెయ్యాలో డాకిని గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు." కెమెరా డాకిని మీదకు ఫోకస్ అయ్యింది. డాకిని గొంతులో నవరసాలూ పలికిస్తూ "ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి" అని చెప్పి అగ్గిపెట్టె తీసింది. అది చూసిన యాంఖరిణి ఎక్సయిట్మెంటుతో దాదాపుగా జుట్టుపీక్కుంటూ అరిచింది "వావ్, మీకు యూ.ఎస్.లో మాచ్బాక్సెస్ దొర్కుతాయా అండీ, మాకు ఇండియాలో ఇవి చాలా రేర్." డాకిని విచారంగా చెప్పింది "అవునండీ, టూ యియర్స్ బ్యాక్ యూ.ఎస్. కీ రావ్డాన్కి ముందూ ఇండియాలో ఇంకా టూ స్టోన్స్ మధ్యలో కాటన్ పెట్టి కొట్టి స్టవ్ ఆన్ చేసేవాళ్ళు. ఇంకా డెవలప్ అవ్వ్లేదన్నమాట."
"ఎలా అయినా మీరు చాలా ఎడ్వాన్స్డ్ అండీ" అంది యాంఖరి ఆరాధనగా చూస్తూ
కె.స్వ. : (యాంఖరిని ఉద్దేశించి )ఆపెహే ఎదవగోల. నువ్వు దాని వీపెంత గోకినా అది నీకు ఇక్కడ ఉండటానికి స్పాన్సర్ చెయ్యదు. సోదాపి పంజూడు.
కాసేపటి తర్వాత ... డాకిని కూర కలియబెడుతూ మాట్లాడుతోంది "ఇలా ఇంగ్రీడియెంట్స్ అన్నీ మిక్స్ చేసాక కాసేపు మూత్పెట్టి ఉడ్కనివ్వాలి" డాకిని ఛాన్సివ్వకపోవటంతో యాంఖరి చాలాసేపట్నించీ ఏం మాట్లాడలేదేమో, వెంటనే జంప్ చేసి అందుకుంది "మూతి పెడితే కాలదా అండీ??"
కె.స్వ. : మూతి పెట్టటం కాదే ముష్టి మొహమా. మూత పెట్టటం.
మొత్తానికి కూర సిద్ధం అయ్యింది. డాకిని ఫినిషింగ్ టచ్ ఇస్తూ చెబుతోంది "ఇదండీ మన 'కాకర ..... పోసి కూర' ఇలా దీన్ని సెర్వింగ్ బౌల్లోకి తీస్కుని సెర్వ్ చేసేముందు గాడిదపాలతో గార్నిషింగ్ చేసుకుంటే టేస్ట్ అదురుతుంది." యాంఖరికి అప్పటికే చాలాసార్లు వావ్ అని అరిచీ అరిచీ గొంతు బొంగురుపోవటం వల్ల ఇంక అరిచే ఓపిక లేక అక్కడే ఉన్న డాకిని పిల్లలిద్దరిని టేస్ట్ చెయ్యడానికి పిలిచింది. వాళ్ళల్లో చిన్నవాడు పరీక్షగా గిన్నెలోకి తొంగి చూసి చెప్పాడు "ఛీ, యాక్, దిస్ ఈజ్ లుకింగ్ లైక్ షిట్. ఇది నేను తినను". పెద్దవాడు చిన్నవాడి చెవిలో రహస్యంగా చెప్పాడు "హే బ్రో, తినొచ్చు పర్లేదు. ఇది మామ్మ్ రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేసిన డిష్. మామ్మ్ తను చేసిన అసలు డిష్‌ని వెనకాల దాచిపెట్టింది. ఈ యాంఖర్ ఆంటీ ప్రోగ్రాం చివర్లో చీర ఇవ్వకపోతే ఆమెతో ఆ డిష్ తినిపిస్తానని ఇందాక డాడ్ కి చెబుతుంటే విన్నాను" అంతా విన్న యాంఖరికి కాళ్ళూ చేతులూ చల్లబడ్డాయి. ఎందుకైనా మంచిదని చీర పాకెట్టు ముందుగానే పైకి తీసి ఉంచింది.
కె.స్వ. : తిక్క కుదిరింది. ఆ చీర ఎవడైనా ఎత్తుకుపోతే బాగుండు.
యాంఖరి డాకినిని అడిగింది, "ఈ కర్రీ మీరెవరిదగ్గర నేర్చుకున్నారండీ?" డాకిని గర్వంగా చెప్పింది "ఇంకెవరు, మా అమ్మ. ఆవిడ కాకరకాయ కూర మొదట్లో అందరిలాగే మామూలుగానే చేసేది. తర్వాత్తర్వాత మా నాన్న మీద కోపం వచ్చినప్పుడల్లా ఇలా చేతికందిన ఒక కొత్త ఇంగ్రీడియెంట్ అందులో ఆడ్ చేస్తూ పోయేది. మా నాన్న పైకిపోయే నాటికి మీరిప్పుడు చూస్తున్న ఈకర్రీ తయారైంది."
కె.స్వ. : పాపం పిచ్చి మానవుడు. ఎలా తట్టుకున్నాడో అంత హింసని. గాడిద పాల దగ్గరికొచ్చేటప్పటికి ఇక భరించలేక టపా కట్టేసుంటాడు.
యాంఖరి అందుకుంది మళ్ళీ, "ఇప్పుడు మీరు ప్రిపేర్ చేసిన డిష్ న్యూట్రిషన్ వ్యాల్యూస్ తెల్స్కుందాం. దీన్కోసం, ఇండియాలోని మన న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ అండ్ మన షెఫ్ గారు వీడియో కాంఫరెన్స్లోకి వస్తున్నారు " టి.వి. తెరమీద ఒక ఆడ ఒక మగ ప్రత్యక్షమయ్యారు. ఆడావిడ జుట్టు కత్తిరించేప్పుడు మీద పడకుండా వేసుకునే కోటులాంటిది వేసుకుంది. ఇక షెఫ్ గారికి అదేదో విఠలచార్య సినిమాలో దయ్యాలకు తొడిగినట్లు ఒళ్ళంతా
తెల్లటి బట్టలు తొడిగి, తెల్ల టొపీ పెట్టి, చేతులకు తెల్లటి గ్లోవ్స్ వేశారు. మొహానిక్కూడా బాగా సున్నమేసినట్లు మెరుస్తోంది.
న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ అందుకుంది. "డాకిని గారూ, మీరు వారం క్రితం చేసి ఫెడెక్స్ లో పంపిన కూర పార్సెల్ ఇప్పుడే మాకందింది. మీ వంట అదుర్స్. దీనిలో చాలా డిఫెరెంట్ డిఫెరెంట్ ఇంగ్రీడియెంట్స్ ఆడ్ చేశారు మీరు. కాకరకాయ వల్ల మీకాల్రెడీ ఉన్న పిచ్చి ముదురుతుంది. మిరియాలపొడి వల్ల షార్ట్ టెంపర్ పెరుగుతుంది. లాస్ట్‌లో మీరు కలిపిన గాడిద పాలు మీ వంశ వృధ్ధికి, సారీ, మీ రక్త వృధ్ధికి పనికొస్తాయి"
షెఫ్ గారి వంతొచ్చింది. ఆయన కాస్త కొంటెగా చూస్తూ మొదలెట్టారు "నే చెప్పాలనుకున్నది మేడం గారే చెప్పారు అయినా ఒక్క విషయం చెబుతాను. డాకిని గారూ, మీ వంటలో విచిత్రం చూసారా? ఈ కూర చేసి వారం అయినా దీనికింకా బూజు పట్టటం, వాసన రావటం జరగలేదు. మీరు నిజంగా గ్రేట్ అండీ."
కె.స్వ. : బాక్టీరియా కూడా భయపడి చచ్చుంటుంది ఆ కూర తింటానికి.
యాంఖరి అందుకుంది "చూశారు కదండీ ఈనాటి మీ పేట కూ.......క్ oట కార్యక్రమాన్ని. మరి మేం మీ ఇంటిక్కూడా వచ్చి మీరు చేసే కూ...క్ oట టి.వి. లో చూపించాలంటే ఇప్పుడే ఎస్.ఎం.ఎస్. చెయ్యండి."
ఆ తరువాత తెచ్చిన చీరని డాకిని మొహానకొట్టి - అదే - డాకినికి బహుమతిగా ఇచ్చి, ఒక వందమంది మందగా చేతులూపుతూ బై చెబుతూంటే కార్యక్రమం ముగిసింది.

25 comments:
వావ్! రెండు సంవత్సరాల బ్రేక్ తీసుకుని ఇలా సరికొత్త టీవీ వంటకంతో మా ముందుకొచ్చారన్నమాట. వావ్.. సో నైస్ అండీ! :)
అద్ధర గొట్ట్శారంతే! ROFL
తిరిగొస్తూ వస్తూ మంచి టపా తెచ్చారే!
కెమెరామన్ స్వగతాలే మనందర్వీ..ఏవంటారు? వీళ్ల ఓపికలు పాడుగాను, ఆంధ్రా అంతా తిరిగాక విదేశాలక్కూడా వెళ్లారే అని ఎప్పుడు చూసినా కొత్తగా ఆశ్చర్య పోతుంటా నేను
Welcomeback sir :) విశ్వరూపం చూపించారు, నవ్వులే నవ్వులు :) కె.స్వ కెవ్వు అసలు :))
చాలా బాగుందండీ.
కానీ మీ యాంఖరిణి ఏమిటండీ, "వంట వంట " అనుకుంటూ? టెల్గూలో "వంట" ని "కుకింగ్" అంటారనీ, "కూర" ని "డిష్" అంటారనీ తెలియదా? ఎప్పుడు నేర్చుకుంటుందో ఏమో పాపం !
శారద
కడుపుబ్బా నవ్వుకుని ఎన్ని రోజులయ్యిందో... మీ బ్లాగు వంట మా కళాపూర్ణోదయం (ముక పుస్తక గుంపు) లో పోస్ట్ చేసాము. నిజమే గడ్డి పచ్చడి కూడా అమృతప్రాయంగా చేసే మా అమ్మ కూడా ఈ దిక్కుమాలిన వంటల కార్యక్రమాలన్నీ క్రమం తప్పకుండా చూస్తుంది. :)చాలా బాగా వ్రాశారు.

Kottapali garu FB lo share cheste mee blog chusaa! Vammoo! bhale navvincharandi :))) Prati line lo meeru vesina satires ki ichina punchlaki oka salaam :))) Hillarious!!
వేణు గారు, కొత్తపాళీ గారు, సుజాత గారు, వేణు శ్రీకాంత్ గారు, శారద గారు, వర్ష గారు, ఇందు గారు - ధన్యవాదాలండీ :)
:):):) వావ్! కేక టపా అండీ! నాకెందుకో కెమెరామెన్ నచ్చాడు. ప్రతీ ఇంట్లోనూ ఉండే గోలే ఇది. ఆఖరికి గులాబ్జాములతో కూడా మసాలా కూర చెప్తున్నారు.
బాగు బాగు.. గతంలో ఈ ప్రహసనంపై నాదైన స్పందన బ్లాగాను..
హహహ్హ...సూపర్! భలే నవ్వించారు. మీరు ఒకటి చెప్పడం మరచిపోయారు. ఆ పెంట...అదే అదే వంటని యంఖరిణి రుచి చూస్తూ..
"వావ్ చోలే చోలే (అదే చాలా చాలా...నాకు చోలే చోలే అని వినిపిస్తుంది మరి) బాగుందండీ...చోలే క్రిస్పీగా, కారంగా, పుల్లగా నోట్లో పెట్టగానే పళ్ళకి, నాలుకకి తగులుతూ...గొంతులోకి దిగకుండా బయటికి వచ్చేసాలా చాలా బావుంది. చూసారు కదా మరి మీరు కూడా ఈ వంటని ట్రై చేసి మీ హస్బేండ్ కి పిల్లలకి పెట్టి మాంచి మార్క్స్ కొట్టేయండి" అంటుంది. :)
బాగుందని కామెంటు రాసేవాడిని కానీ ఈ మధ్య మీరసలు ఏమీ రాయలేదని కోపమొచ్చి రాయలేదు.
ఆద్యంతం సూపరో సూపరు!!
:DDDDDDDDDDDD
చాలా బాగుంది..అందరికి మింగుడు పడేలా.....హ ..హా.
రసజ్ఞ గారు, జ్యోతి గారు, సౌమ్య గారు, జీడిపప్పు గారు, IM గారు, లక్ష్మి రాఘవ గారు - చాలా ధన్యవాదాలండీ :)
రాజేంద్ర కుమార్ గారు - మనం మనం చంపిలం. ఆ పక్షపాతంతో క్షమించేసేయండి :)
అహా సూపరు ,,,
Cannot stop laughing! Very good comedy tonic!
navvule navvulu.
navvule navvulu.....:D
navvule navvulu.....:D
So good Phani. Keep posting.
Post a Comment