నేను వీధినబడి(అనగా చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాన్వేషణకై రోడ్డెక్కి) దగ్గర దగ్గర దశాబ్దం పూర్తవ్వొస్తోంది. ఈ సందర్భంగా వెనక్కు తిరిగి నా ప్రయాణం ఒక్కసారి నెమరేసుకోవడం, అంతకన్నా ముఖ్యంగా నా ఉద్యోగ పర్వంలోని వివిధ దశల్లో కీలకమనదగ్గ అవకాశాలు కల్పించిన ముగ్గురు స్నేహితులను గుర్తు చేసుకోవడం కోసం ఈ ప్రయత్నం.
అప్పుడొచ్చింది నేనెన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న బ్రేక్. ఈసారి మిత్రుడు చంద్రశేఖర్ రూపంలో. తను బెంగుళూరులోని ఒక పెద్ద కంపెనీలో పనిచేసేవాడు. ఒకరోజు తను ఫోన్ చేసి రెజ్యూమె పంపించమని చెబితే పంపాను. రెండురోజుల తరువాత మొదటి రౌండు, మరో వారంలో రెండో రౌండు పూర్తయ్యాయి. మరుసటి రౌండు త్వరలో ఏర్పాటు చేస్తామని చెప్పారుకానీ నెలదాకా ఎలాంటి సమాచారమూ లేదు. దీనిమీద చాలా ఆశలు పెట్టుకున్న నాకు చాలా నిరుత్సాహం కలిగింది. ఇంతకాలం ఎటువంటి జవాబూ రాకపోయేటప్పటికి నేను తిరస్కరించబడ్డాననే అనుకున్నాను. చందు మాత్రం త్వరలో పిలుపు వస్తుందని చెబుతూ వచ్చాడుకానీ నిజం చెప్పాలంటే ఆసమయంలో నాకామాటలు ఏమాత్రం నమ్మకాన్ని కలిగించలేదు. అసలు సంగతి తేల్చెయ్యకుండా తనెందుకనో నానుస్తున్నాడని ఏమూలో అనిపించిన విషయం మాత్రం వాస్తవం. ఇలా ఆశ నిరాశల మధ్య ఊగిసలాడి చివరకు ఈ ప్రయత్నం విఫలమయ్యిందని డిసైడ్ అయిపోయినంతలో ఒకరోజు ఉన్నట్లుండి ఆ కంపెనీ నుంచి ప్రాజెక్ట్ మానేజర్ ఒకాయన ఫోన్ చేసి త్వరలో నన్ను పర్సనల్ ఇంటర్వ్యూకు హాజరు కమ్మని చెప్పారు. మళ్ళీ ఆశలపల్లకీ భుజాలపైకెక్కింది. చందుకు ఫోన్ చేసి వివరాలవీ చెప్పి మళ్ళీ ఇందాకటి మానేజర్‌కు ఫోన్ చేసి నేను రాగల తేదీ చెప్పేశాను. ఇక అతిపెద్ద పనొకటి మిగిలింది, బాసుతో మాట్లాడి సెలవు సంపాదించడం.
చాలా ఆఫీసుల్లోలాగే మా ఆఫీసులోనూ బాసుకు కొంతమంది గూఢచారులుండేవాళ్ళు. వారిలో ఒకరు నేను చివరగా బెంగుళూరులోని మానేజరుతో ఫోన్ మాట్లాడుతున్న వివరాలు ఎలాగో విన్నాడని తెలిసింది. ఇక కాస్త టెన్షన్ మొదలయ్యింది. బాసుకు అబధ్ధంచెప్పి బెంగుళూరు వెళ్ళొద్దామనుకున్న అభిప్రాయంలో ఉన్నవాడిని అర్జంటుగా ఆప్రయత్నాన్ని విరమించుకోవాల్సి వచ్చింది. చేసేదిలేక బాసు దగ్గరికి వెళ్ళి నిజం చెప్పేసి సెలవడిగాను. విషయం విన్నాక ఎగిరిపడతారనుకున్న మా బాసు విచిత్రంగా చాలా ప్రశాంతంగా అంతా విని నేను వెళ్ళబోయేది చాలా మంచి కంపెనీ అని, ఇది నాకు చక్కటి అవకాశం అని నాలుగు మంచిమాటలు చెప్పి మరీ సెలవిచ్చారు. రిజర్వేషన్ కూడా పెద్దగా ఇబ్బంది పడకుండానే దొరికింది. ఇన్ని మంచి శకునాల మధ్య నేను మొదటిసారి ఆంధ్ర రాష్ట్ర సరిహద్దులు దాటి బెంగుళూరులో అడుగుపెట్టాను.
ఇంటర్వ్యూ ముందురోజు చందును కలిసినప్పుడు తను నేను దాదాపుగా ఎంపిక అయినట్లేననీ, ఇప్పుడీ ఇంటర్వ్యూలు నామమాత్రమేననీ చెప్పాడు. ఇంటర్వ్యూ ఆదుర్దాతో కొంతా, ఆ భవనాలూ, కార్పొరేట్ వాతావరణమూ, రంగు హంగులూ చూసి మరికొంతా డీలాపడ్డ నాకు మంచి టానిక్‌లాగా పనిచేశాయి ఆ మాటలు. మనసులోనుంచి టెన్షన్ పూర్తిగా ఎవరో చెయ్యిపెట్టి తీసేసినట్లుగా మాయమయిపోయింది. మరుసటిరోజు వరుసగా మూడు ఇంటర్వ్యూలు జరిగితే అన్నీ పూర్తి ఆత్మ విశ్వాసంతో చేశాను. ఫలితం చెప్పడానికి ఇంకా సమయం తీసుకుంటారేమో అనుకున్నానుగానీ సాయంత్రం నా మూడో ఇంటర్వ్యూ పూర్తయిన కాసేపటికి తీపికబురు తెలిసింది. అప్పుడు చెప్పాడు చందు, తను ఇదివరకు చెప్పిన మాటలు నాలో విశ్వాసం కలిగించడానికి చెప్పినవి మాత్రమేననీ నా ఎంపిక తరువాతి ఇంటర్వ్యూలన్నీ చేసిన తరువాతే జరిగిందనీ. నా మానసిక స్థితిని సరిగ్గా అంచనా వేసి సమయస్ఫూర్తితో చందు చెప్పిన ఆ మాటలు నాకు చెప్పలేనంత మేలు చేశాయి. అంతేకాక ఒక టీం వాళ్ళు నన్ను రెండో రౌండ్ వరకు ఇంటర్వ్యూ చేసి ఆపేసి ఎటూ తేల్చకుండా తాత్సారం చేస్తుంటే చందు వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని మరో టీం వారికి నా రెజ్యూమె పంపించి నన్ను రికమెండ్ చేసి మళ్ళీ ఇంటర్వ్యూ ఏర్పాటు చేయించిన విధానం అంతా తెలిసి నాకు నోట మాట రాలేదు. ఆవిధంగా బెంగుళూరు ఐ.ఐ.ఎం ఎదురుగా ఉన్న కంపెనీలో నా కార్పొరేట్ జీవితం మొదలయ్యింది.
మామూలుగా తెలుగు సినిమా కథలయితే ఇక్కడితో శుభం కార్డు పడిపోతుంది. కానీ మా వైజాగ్ బాసు ఇంకావుంది అని చూసుకోవటానికి అలవాటుపడ్డ ప్రాణం కావడంతో కథలో ఒక చివరాఖరి మెలిక పెట్టారు. తిరిగి వెళ్ళినతరువాత నన్ను తన చాంబర్లోకి పిలిచి వివరాలు అడిగారు. ఉద్యోగం లభించిన ఉత్సాహంలో ఉన్న నేను ఒక ప్రవాహంలా మొదలుపెట్టి అన్ని వివరాలూ చెప్పుకుంటూ పోతున్నానేగానీ ఆయన అంతా శ్రధ్ధగా వింటూ నేనెక్కడ దొరుకుతానా అని చూస్తున్నట్లు మాత్రం గ్రహించలేదు. ఉన్నట్లుండి నన్ను మధ్యలో ఆపి "అయితే నువ్వు చేస్తున్న ప్రాజెక్టుల వివరాలు కూడా చెప్పావన్నమాట" అని అడిగారు. మామూలుగా ఏ ఇంటర్వ్యూలోనైనా మీరు ప్రస్తుతం పనిచేస్తున్న ప్రాజెక్టు వివరించమని అడుగుతారు కాబట్టి అందులో నాకేమీ తప్పు కనిపించలేదు. చెప్పానని బదులిచ్చా. అంతే, బాసు అగ్గిరాముడై శివాలెత్తిపోతూ కంపెనీ రహస్యాలను బయటివాళ్ళకు చెప్పినందుకు నన్ను చీల్చి చెండాడటం మొదలుపెట్టారు. మేము పనిచేస్తున్నవన్నీ సాధారణ ప్రాజెక్టులు మాత్రమే, ఏవీ ప్రోడక్టులు కాదు. మా కంపెనీ వ్యాపార రహస్యాలు అవతలివాళ్ళకు తెలిసిపోతాయన్న భయాలేవీ పెట్టుకోవాల్సిన అవసరం లేదక్కడ. నేనిచ్చే వివరణను బాసు ఎంతమాత్రమూ పట్టించుకోలేదు. ఇషాక్‌ను పిలిచి విషయం వివరిస్తే ఆయనా బాసుకు సర్దిచెప్పటానికి ప్రయత్నించారు కానీ బాసు అప్పటికీ శాంతించలేదు. కాసేపటిగ్గానీ బాసు మనసులో ఉన్న అసలు విషయం బయటికి రాలేదు. నేను నా రిలీవింగ్ లెటర్ తీసుకోవాలంటే తెల్ల కాగితం మీద సంతకం పెట్టాలని షరతు విధించారు ఆయన. నాకు దిక్కు తోచలేదు. మిగిలిన సహోద్యోగులకు విషయం చెబితే ఎట్టిపరిస్థితుల్లోనూ అలా చేసి ఇరుక్కోవద్దని సలహా ఇచ్చారు. బాసేమో సంతకం లేకుండా లెటరిచ్చే ప్రశ్నే లేదని తేల్చి చెప్పారు. అలా ఒక రెండు గంటలు ఇబ్బంది పెట్టిన తరువాత చివరికి ఆయన ఏమనుకున్నారో ఏమో నాక్కావాల్సిన లెటర్లన్నీ సంతకం పెట్టి ఇచ్చేసి తక్షణం ఆఫీసు వదిలి వెళ్ళిపొమ్మని చెప్పేశారు. ఎలాగయితేనేం మెత్తబడినందుకు బాసుకు థాంక్స్ చెప్పుకుని బతుకు జీవుడా అంటూ బయటపడ్డాను.
అదండీ, నా గుండ్రాలు, గుండ్రాలు ఫ్లాష్‌బాక్. అలా నా ఉద్యోగ నౌక ప్రశాంత తీరానికి చేరుకుంది. దానికి సాయం పట్టినవాళ్ళు హెచ్.ఎస్, కిరణ్ మరియు చందు. ఉద్యోగాల పరంగా చూస్తే ఒకరి సాయం గొప్పగా మరొకరిది చిన్నగా బయటివారికి అనిపించవచ్చు. కానీ నాకు సంబంధించినంతవరకూ ముగ్గురిదీ అమూల్యమైన సహాయం, ఎక్కువ తక్కువలు లేనేలేవు. నేనీరోజు ఉన్నస్థితికి ప్రత్యక్ష కారణం ఈ ముగ్గురూ అన్న కృతజ్ఞతా భావం నా మనసులో ఎప్పుడూ మెదులుతూనే ఉంటుంది. థాంక్స్ చెబితే వాళ్ళ స్నేహాన్ని, సహాయాన్ని చిన్నబుచ్చినట్లే అవుతుంది. అయినా నాకింకెలా వ్యక్తం చెయ్యాలో తెలియక ఇలా చెప్పక తప్పటంలేదు "థాంక్స్ రా హెచ్.ఎస్! థాంక్స్ రా కిరణ్!! థాంక్స్ రా చందు!!!"
12 comments:
good... baavundi mee journey.
ఏ ఒక్కరైనా నలుగురి తోడ్పాటు లేకుండా బతకగలరా? నలుగురూ లేందే మనిషి మనుగడే లేదు! మనిషికెప్పుడూ మనిషి తోడు కావాలి..సహాయం కావాలి..
మిత్రులుగా వాళ్ళ ధర్మం వారు నిర్వర్తించారు....ఆ సహాయాన్ని గుర్తు పెట్టుకొనే మీ ధర్మం మీరు నిర్వర్తించారు...అందరు అబినంధనీయులే....
ఈ నాలుగో భాగం మరీ మరీ బావుంది.
> ఉద్యోగాల పరంగా చూస్తే ఒకరి సాయం గొప్పగా మరొకరిది చిన్నగా బయటివారికి అనిపించవచ్చు. కానీ నాకు సంబంధించినంతవరకూ ముగ్గురిదీ అమూల్యమైన సహాయం, ఎక్కువ తక్కువలు లేనేలేవు.
.. ఎంత చక్కగా చెప్పారు!
good ending...all the best for ur career in HTS..:)
అలాంటి స్నేహితులు ఉన్నందుకు మీరు చాలా అదృష్టవంతులు...నిజమే కదా...అలాంటి స్నేహితులే లేకపోతె మనం ఈ రోజు ఎక్కడ వుండేవాల్లమో...ఎన్నెన్ని సందర్భాల్లో ఎంతంత సాయం పొందుతాం వారినుండి.... మీ టపాలు చదివాకా నాకు కూడా అలా అందర్నీ ఒకసారి తల్చుకోవాలని ఉంది...
మంచి పోస్ట్లను అందించారు...
వింటుంటే చాల బాగుందండి మీ ప్రయాణం.ఆనందం అనేది మనం ఆస్వాదించే దాని మీద ఆధారపడి ఉంటుంది.ఎంత కష్టపడితే అంత ఆనందం వస్తుందనేది సత్యం.అది మిమ్మల్ని చూస్తే ఇంకా అవగతమవుతుంది.
i wish u a successful journey in the future .
swami
nijamga ,na peru rama krishna sarma, naku blogadam ante chala istam , kani yelo blogalo teliyaka intakalam satamatamiyinanu
kani mere na bloguruvu ante blogging guruvu .........
pranamam guruvarya nannu baga blogamani devinchandi....
కిరణ్ గారు, నరేంద్ర గారు, వేణు గారు, రాజ్ గారు, శేఖర్ గారు, కిషన్ గారు - పోస్టు నచ్చినందుకు ధన్యవాదాలు.
RKS గారు - ఆర్యా, నేను మీకెలా గురువయ్యానో అంతుపట్టకుండా ఉంది. నేను వ్రాసిన పోస్టు ఏదయినా చూసి ఇన్స్పైర్ అయ్యారేమో తెలియదు కానీ ఇక్కడ నాకన్నా మించిన మహా మహులున్నారు. బ్లాగులు క్రమం తప్పక చదువుతూంటే మీకే అవగతమవుతుంది. ఏదేమైనా మీరు చక్కగా బ్లాగాలని, మంచి పోస్టులు చదివే భాగ్యం మాకు కలిగించాలని కోరుకుంటున్నాను.
ఒక విధం గ చెప్పాలంటే నాకు ఒక బ్లాగ్ తాయారు చేయాలనీ ఉండేది కాని నేను ఒక బ్లాగ్ చేయడానికి కారణం మాత్రం మీ బ్లాగాగ్ని చుసిన తర్వాతనే అండి.అందువల్ల మీరు కూడా నాకు గురువులే .మరియు నా పేరు కిషన్.మీరన్న నరసరావుపేట పక్క గుంటూరు నాది.mbbs చివరి సంవత్సరం చదువుతున్నాను.మీ బ్లాగ్ చాల బాగుందండి.
dis is all i can say.
కిషన్ గారు,
నా బ్లాగు నచ్చినందుకు, మీ గురువుగా ఇంత మంచి స్థానం ఇచ్చినందుకు డబుల్ సంతోషంగా ఉందండీ :) మీ బ్లాగింగ్ అవిఘ్నంగా కొనసాగాలని కోరుకుంటున్నాను. త్వరలో మీ బ్లాగులో ఎం.బి.బి.ఎస్ తాలూకు ముచ్చట్లు మాతో పంచుకుంటారని ఆశిస్తున్నాను.
ఇకపోతే మాదీ గుంటూరే, నరసరావుపేటకు రోజూ రైల్లో వెళ్ళివచ్చేవాడినంతే.
ఓహో గుంటూరులో ఎక్కడ మీది?అసలు మీ బ్లాగ్ పేరే అరిపించారు!!!!!
hi phanigaru,
meeku nenu gurtu unnananukuntunannu. Ma bandhuvulu Pune lo unnarandi.. meeru na mails ki reply ivvatledu.
Me phone no. inka inti address(pune) iste..mimmalani kalise avakasham untadi..
dhanyavadamulu,
aditya
Post a Comment